ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గుట్టమీద పల్లి యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని జనవరి 10వ తేదీ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి 25 వేల రూపాయలు రెండో బహుమతి 20000 రూపాయలు మూడో బహుమతి 15000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన కబడ్డీ జట్టు టోర్నమెంట్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.