నంద్యాల జిల్లా పాములపాడు లోని బస్టాండ్ ఆవరణ ఆదివారం చిత్తడిగా మారింది, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో కురిసిన చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు,రహదారిపై ఉన్న మట్టి కంకర బురదమయంగా మారి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తుంది,ఆదివారం సంతకావడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులు స్పందించి మట్టిని తొలగించి కాంక్రీట్ వేయాలని కోరుతున్నారు