దుబ్బాక: దుబ్బాక కు చెందిన BRSజిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీమంత్రి హరీష్ రావు
BRS పార్టీ సీనియర్ నాయకుడు, సిద్ధిపేట జిల్లా BRS ఉపాధ్యక్షుడు గుండవెళ్లి ఎల్లారెడ్డి కుమారుడు గుండవెళ్లి భరత్ రెడ్డి - చర్విత రెడ్డి వివాహానికి ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. సిద్దిపేట లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువరులని ఆశీర్వదించిన, శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ, సోలిపేట సతీష్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.