మార్కాపురం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రఫీ మాట్లాడుతూ తమ సమస్యలపై ప్రశ్నించిన యూనియన్ నాయకుల పై బెదిరింపులు మానుకోవాలి అన్నారు. ఒంగోలు కార్పొరేషన్ లో అక్రమంగా తొలగించిన కార్మికురాలు విజయమ్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.