ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన రూ.2కే కేజీ బియ్యం పథకం, పటేలు–పట్వారి వ్యవస్థ రద్దు వంటి చారిత్రక నిర్ణయాల ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్కే దక్కుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం వసంతనగర్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కృష్ణారావు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అవినీతి రహిత రాజకీయవేత్తగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.