పీలేరులో ఘనంగా అంతర్జాతీయ దత్తత మాసోత్సవం
పీలేరు మండలం పీలేరు పట్టణంలోని వెలుగు కార్యాలయం నందు శుక్రవారం అంతర్జాతీయ దత్తత మాసోత్సవాన్ని ఎపియం జవహర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాలబాలికల సంరక్షణలో భాగంగా అన్నమయ్య జిల్లా శిశుగృహ ప్రత్యేక దత్తత విభాగం పీలేరులోని వెలుగు కార్యాలయంలో అంతర్జాతీయ దత్తత మాసోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం చేపట్టారు.దత్తత పక్రియ మరియు దత్తత కొరకు పిల్లలు లేని తల్లిదండ్రులకు కావాల్సిన పత్రములు మరియు అనాద పిల్లలు,వదిలివేయబడిన పిల్లలు,అప్పగించబడిన పిల్లలకి మరియు రక్షణ,సంరక్షణ పిల్లలులేని తల్లిదండ్రులకు ప్రేమను పంచే కుటుంబాన్ని ఏర్పాటు చేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు