కనిగిరి: పట్టణంలోని బీసీ 2 హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ సిఫారసు : మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు
కనిగిరి పట్టణంలోని బీసీ 2 హాస్టల్ ను మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డితో కలిసి సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ లో 21 మంది విద్యార్థులు ఉంటే 75 మందికి హాజరు వేసి ఉండడాన్ని గమనించిన జాయింట్ కలెక్టర్ , ఫేక్ అటెండెన్స్ రిజిస్టర్ ఏర్పాటు చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... బీసీ 2 హాస్టల్ లో అవకతవకలకు పాల్పడుతున్న హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. హాస్టల్ పరిసరాలు, టాయిలెట్లు కూడా సక్రమంగా లేవని అన్నారు.