పలమనేరు: మతసామరస్యాన్ని చాటుకున్న ముస్లింలు, అయ్యప్ప దీక్షలో ఉన్న యువకులకు అన్నదానం
పలమనేరు: పట్టణం రంగాపురం స్థానికులు మీడియా తెలిపిన సమాచారం మేరకు. తమ మతాన్ని ఆచరిస్తూ, ఇతర మతాలను గౌరవించే సంప్రదాయం మన భారత దేశంలో కనిపిస్తుంది. ఈ విషయాన్ని చాటి చెప్పే ఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతుంటాయి. రంగాపురంలో సుమారు 50 మంది అయ్యప్ప మాల వేసిన భక్తులకు ముస్లింలు భిక్ష (అల్పాహారం) ఏర్పాటు చేసి సోదరభావాన్ని చాటుకున్నారు. దీంతో పలువురు ప్రజలు వీరిని అభినందిస్తున్నారు.