మేడిపల్లి: భీమారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
చిన్నారుల ఉజ్వల భవిష్యత్ కు అంగన్వాడీలె పునాది అని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉమ్మడి మేడిపల్లి లో పర్యటించారు.భీమారం మండల గోవిందారo, మన్నెగూడెం, భీమారం మండల కేంద్రంలో,గ్రామంలో 36 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి,ఒడ్యాడ్ గ్రామంలో 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన రాష్ట్ర ప్రభుత్వ విప్ శంకుస్థాపన చేశారు.అనంతరం వెంకట్రావుపేట గ్రంలో డిపిఈపీ నిధులతో నిర్మించిన ప్రహారి గోడను ప్రారంభించారు.మేడిపల్లి మండల కేంద్రంలో 10 లక్షల విలువ గల 30 సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.