అనంతపురం నగరానికి చెందిన జిమ్ ఓనర్ రాజశేఖర్ కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య మనీషాను గన్ తో బెదిరించేందుకు ప్రయత్నించాడు దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో తాను గన్ కొనుగోలు చేసినట్లుగా రాజశేఖర్ తెలపడంతో ఆ నేపథ్యంలో పోలీసులు విచారణ చేశారు. డొంక లాగితే తీగ కదిలినట్లుగా మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. దీంతో ఐదు కంట్రీమేడ్ గన్స్, 30 లైవ్ బుల్లెట్లు, ఒక బుల్లెట్ సెల్ఫ్ తో పాటు ఖాళీ సెల్ఫ్ లను స్వాధీనం చేసుకున్నారు.