పొట్టేలు తలను ముక్కలుగా చేస్తుండగా ప్రమాదవశాత్తు కొడవలి తగిలి వ్యక్తికి గాయాలు
Anantapur Urban, Anantapur | Mar 31, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రంలో పొట్టేలు తలను విడివిడి భాగాలుగా ముక్కలుగా చేస్తుండగా ప్రమాదవశాత్తు కొడవలి తగలడంతో ఎర్రి స్వామి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రమైన రక్తస్రావం అవుతుండడంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.