హుస్నాబాద్: కోహెడ మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ మండల కేంద్రంలో రైతువేదిక వద్ద నూతన రేషన్ కార్డులు,కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులు ,cmrf చెక్కులు, కాటమయ్య రక్షణ కవచాలు,మహిళలకు వడ్డీలేని రుణాలు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల కోహెడ మండలంలో 39 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామని,స్టీల్ బ్యాంక్ అందరూ వాడాలి.. ప్లాస్టిక్ లో వేడి అన్నం తినడం వల్ల విషం తిన్నట్టే అని క్యాన్సర్ ,గర్భసంచి ,డయాలసిస్ ,ఇతర వ్యాధులు వస్తున్నాయని తెలిపారు.గతంలో దొడ్డు బియ్యం వచ్చేవి..ఇప్పుడు ప్రజా పాలన ప్రభుత్వం లో సన్న బియ్యం ఇస్తున్నామని,గత 10 సంవత్సరాలుగా ఒక్క