పోలీసు అధికారుల తీరుకు నిరసనగా రాయదుర్గంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. శుక్రవారం కోర్టు వద్ద నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేశప్ప, ప్రధానకార్యదర్శి వన్నూరస్వామి మాట్లాడుతూ పత్తికొండ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చిన ముద్దాయిని అక్కడి పోలీసు అధికారులు మఫ్టీలో వచ్చి నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారన్నారు. వారిపై DGP చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.