ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో లక్ష్మీ వెంకటేశ్వర మోటార్ మెకానిక్ షాపు శనివారం రాత్రి అగ్ని ప్రమాదంలో దగ్ధమైన విషయం తెలిసినదే. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. షాప్ యజమాని కోటిరెడ్డి మాట్లాడుతూ షాపులో ఉన్న మోటార్ బైకులన్నీ కాలిపోయి బూడిదగా మారాయి అన్నారు. సుమారు ఆరు లక్షలు నష్టం జరిగిందని వాపోయారు. దీంతో మెకానిక్ యూనియన్ నాయకులు బాధితుడికి అండగా నిలబడ్డారు.