రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగ రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ రెవెన్యూ క్లినిక్ లో ప్రత్యేకంగా నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని నియమించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రాజాబాబు విలేకరులతో మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువ ఫిర్యాదులు రెవెన్యూ సమస్యలపై వస్తున్నాయని కలెక్టర్ అన్నారు.