తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని గౌడు సెంటర్ లో ఎన్టీఆర్ కు టీడీపీ నాయకులు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం పార్టీ కార్యాలయం నందు లెజెండరీ బ్లడ్ క్యాంప్ నిర్వహించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. తెలుగువారీ ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక అని.. టీడీపీ స్థాపించిన 90 రోజుల్లో అధికారంలోకి రావ చారిత్రాత్మకమని అభివర్ణించారు. సంక్షేమ పథకాలు పేరు మీద పేదలకు కిలో రూ. 2లకే బియ్యం అనేది జీవితంలో గుర్తుండిపోయే పథకమని పేర్కొన్నారు.