కలికిరిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ "సంస్థాగత నిర్మాణ్" కార్యక్రమం
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో కాంగ్రెస్ పార్టీ "సంస్థాగత నిర్మాణ కార్యక్రమం" ను ఆదివారం పీలేరు నియోజకవర్గ ఇంచార్జ్ లాయర్ బాలి రెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 300మందితో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. కలికిరి క్రాస్ రోడ్ పీలేరు మార్గంలోని నగిరిపల్లి క్రాస్ నుంచి బీడీ కాలనీ ఎన్ యస్ కళ్యాణ మండపం వరకు డప్పు వాయిద్యాలు బాణా సంచా కాల్పుల మధ్య నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇంచార్జి సోమశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నారు