అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లోని పెద్దవడుగూరు మండల కేంద్రంలో మద్యం మత్తులో కుల్లాయప్ప అనే వ్యక్తిపై మరో వ్యక్తి బీరు బాటిల్తో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన పుప్పాల గ్రామానికి చెందిన కుళ్లాయప్పను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.