మఖ్తల్: మఖ్తల్ ఈనెల 23న వీర హనుమాన్ శోభాయాత్ర విజయవంతం చేయండి విశ్వహిందూ పరిషత్
మక్తల్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగదళ్ ఆధ్వర్యంలో 23 వ తేదీ మంగళవారం రోజు వీర హనుమాన్ విజయ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ ప్రతినిధులు వి. భీమ్ రెడ్డి, వాకిటి రమేష్, పసుపుల భీమేష్ తెలిపారు. వీర హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వీర హనుమాన్ విజయ శోభయాత్ర మక్తల్ పట్టణంలోని పురవీధుల గుండా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.