అనంతపురంలోని ఓ ఇంటి కబ్జా విషయంలో గురువారం సాయంత్రం 5గంటల సమయంలో ఐదు మందికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. శారద నగర్ లో కనకదుర్గ అనే మహిళకు సంబంధించిన ఇంటిని కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేశారు. కనకదుర్గ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. కనకదుర్గకు చెందిన కుటుంబ సభ్యులు ఈ వ్యవహారాన్ని బయటకు తీసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు 5 మంది నిందితులు బోయ శకుంతల, శేఖర్, ఆవుల సుబ్రహ్మణ్యం, దయ్యాల ఉమాపతి యాదవ్ అమర్నాథ్ చౌదరి అనే ఐదు మందిని అరెస్టు చేసి విచారించారు.