పూతలపట్టు: తవణంపల్లిలో ప్రజా దర్బార్ కూ 100 వినతులు పలు సమస్యలను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే మురళీమోహన్
తవణంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్వయంగా ప్రజల సమస్యలను ఆలకించి, అందిన వినతులను స్వీకరించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు, మహానుభావుడు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. తరువాత ప్రారంభమైన ప్రజా దర్బార్‌లో మండల పరిధిలోని గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను ఒకరి తర్వాత ఒకరిని పిలిపించి వారి సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, సంబంధిత శాఖాధికారులతో నేరుగా మాట్లాడి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.