కొడంగల్: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు నిరసనగా ముస్లింల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం ముస్లిం సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన అనంతరం తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి సిబ్బందికి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా పలు ముస్లిం సంఘాల నాయకులు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ముస్లింలను అణగదొక్కెందుకే ఈ ప్రయత్నం చేసిందని ఆరోపించారు.