నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని క్లబ్ హౌస్ ఆవరణలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి రెండో రోజు మంగళవారం భారీ స్పందన లభించింది. ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి శిబిరాన్ని సందర్శించి, వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పలువురు బాధితులు ఈ శిబిరం నుంచి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.