మార్కాపురం: పొదిలి నిర్మామహేశ్వర స్వామి ఆలయంలోని సమస్యను పరిష్కరించిన చైర్మన్ వెంకటరామయ్య
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని పార్వతి దేవి సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో శివలింగానికి భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేకం చేసిన పాలు మొరుగు కాలవలో పోతూ ఉండడంతో భక్తులు అసహనం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో కథనం వైరల్ అయింది. దీంతో ఆలయ చైర్మన్ వెంకటరామయ్య కార్యనిర్వహణ అధికారి నారాయణరెడ్డి స్పందించారు. పోసిన పాలు కాలువలలో పోకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా పాల కోసం ఒక పాత్రను ఏర్పాటు చేశారు.