జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేస్తామని కలెక్టర్ మరియు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ.ఆనంద్ స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్లో ఐ.అండ్.పీఆర్ (జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ) ఆధ్వర్యంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశాన్ని కమిటీ ఎక్స్ అఫిషియో సభ్యులు మరియు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ మరియు డిఎంఏసి మెంబర్ కన్వీనర్ ఏ.బాలకొండయ్యతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఓ.ఆనంద్ నిర్వహించారు.