గరిడేపల్లి: కల్మల్ చెరువు శివారు వద్ద అదుపు తప్పి సిమెంట్ లారీ బోల్తా
గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు శివారు వద్ద సోమవారం ఉదయం సిమెంట్ లారీ బోల్తా పడింది.జాన్పహాడ్ నుంచి గరిడేపల్లి వైపు వస్తున్న అదానీ సిమెంట్ లోడ్ లారీ, రోడ్డు వెడల్పు పనుల్లో తీస్తున్న గుంతలోకి దూసుకుపోయి అదుపు తప్పిందని స్థానికుడు అంజినాయక్ తెలిపారు. ప్రమాద సమయంలో వెంటనే స్పందించి డ్రైవర్ను కాపాడినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.