సెట్టూరులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Mar 28, 2026
అనంతపురం జిల్లా సెట్టూరు లో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని మహారాష్ట్రకు చెందిన బాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో హుటాహుటిన మెలిగిన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. కళ్యాణ్ దుర్గం నుండి పావుగడకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా సెట్టూరు ఊరి బయట ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.