సరూర్ నగర్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖి: రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు
రంగారెడ్డి జిల్లా: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్లో అధికారులు సిబ్బంది పనితీరు సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను కమిషనర్ సుధీర్ బాబు శుక్రవారం సమీక్షించారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులతోపాటు రిసెప్షన్ పెట్రోలింగ్ స్టాప్ వంటి పలు విభాగాల పనితీరు సీసీటీవీ ల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు .మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.