కొత్తిమీర ధరలు పూర్తిగా క్షీణించాయి. గుత్తిలో ఆదివారం కొత్తిమీర కట్ట కేవలం ఐదు రూపాయలకే విక్రయిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం కట్ట రూ.20 నుంచి రూ.25 విక్రయించారు. ఆదివారం రోజుల్లో కట్ట రూ.40 నుంచి రూ.50 దాకా విక్రయించేవారు. ఈరోజు ఆదివారం అయినప్పటికీ కేవలం ఐదు రూపాయలకే కొత్తిమీర కట్ట లభిస్తున్నది. కొత్తిమీర ధరలు పూర్తిగా పడిపోయాయని కూరగాయల వ్యాపారులు చెప్పారు.