కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామ్య, సామాజిక, న్యాయ వ్యతిరేక విధానాలపై పోరాడుదాం: KVPS జిల్లా కార్యదర్శి తిరుపతి
జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) కరీంనగర్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నట్లు కెవిపిఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పరపు సురేష్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు మంకమ్మతోటలోని జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ..ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కార్మికుల కనీస వేతనాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని మనువాద కార్పొరేట్ విధానాలను ప్రతిఘటిస్తూ జూలై 9 నా జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేవీపీఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు.