జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా బహిరంగ ప్రదర్శనలో డ్రోన్ కెమెరాతో నిఘా నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణుకొట్కూరు ఎస్ఐ మణికంఠ తెలిపారు, నేరాలకు కళ్లెం వేసేందుకే డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు, మద్యపానం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు