దుబ్బాక: కామారెడ్డి రూట్లో సరైన సమయంలో బస్సులు నడపాలని దుబ్బాక ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం అందజేత
దుబ్బాక నుండి కామారెడ్డి వెళ్లేందుకు సరైన సమయంలో బస్సులు నడపాలని దుబ్బాక ఆర్టీసీ అధికారులకు రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు ఆదివారం మధ్యాహ్నం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు దుబ్బాక బస్టాండ్ లో బస్సు కోసం పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. దాదాపు 150 మంది ప్రయాణికులు సుమారు రెండు గంటల పాటు బస్టాండు లో వేచి చూడాల్సి వచ్చింది అన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు కామారెడ్డి రూట్లో సరైన సమయంలో బస్సులు నడపాలని కోరారు.