డా బాబూ జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా కర్నూలులోని ఆర్ ఎస్ రోడ్డు లోని ఆయన విగ్రహానికి ఆదివారం ఉదయం 11 గంటలకు వైకాపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, దేశ అభివృద్ధికి కేంద్రమంత్రిగా అనేక సేవలను బాబు జగ్జీవన్ రామ్ అందించారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.