ఉగాది ఉత్సవాల నేపథ్యంలో మార్చి 2వ తేదీ నుంచి నల్లమల్ల ప్రాంతం గుండా శ్రీశైలం పాదయాత్రకు అనుమతించిన అటవీ శాఖ అధికారులు
మార్చి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీశైలంలో జరగనున్న ఉగాది ఉత్సవాల నేపథ్యంలో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉగాది ఉత్సవాల నేపథ్యంలో మార్చి రెండవ తేదీ నుంచి నల్లమల అడవి ప్రాంతం గుండా శ్రీశైలం పాదయాత్రగా వెళ్లేందుకు భక్తులకు అటవీశాఖ అధికారులు అనుమతించారు. ఉగాది ఉత్సవాల కొరకు పెద్ద ఎత్తున కర్ణాటక కు చెందిన భక్తులు లక్షలాదిగా శ్రీశైలం పాదయాత్రగా వెళ్తారు.అందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.