75 ద్విచక్ర వాహనాలపై పలు రకాల కేసులు నమోదు : ఆర్టీవో మురళీమోహన్
తిరుపతిలో మంగళం చంద్రగిరి రోడ్డు నందు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 75 ద్విచక్ర వాహనాలపై తనిఖీలు జరిగాయి మోటార్ వాహన నియమ నిబంధనలను అతిక్రమించి మొబైల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వారిపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు తనిఖీలలో 45 వాహనాలపై కెమెరా వినియోగించి ఎలక్ట్రానిక్ వాహన తనిఖీ రసీదులో నమోదు చేశారు 30 ద్విచక్ర వాహనాలపై ప్రత్యక్షంగా కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా రెండు లక్షల రూపాయలు అపరాధ రుసుము విధించారు.