పెబ్బేరు: బెక్కెం గూడెం గ్రామ సమీపంలో మొసలిని చంపిన వారిపై కేసు నమోదు చేసిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాణి
వనపర్తి జిల్లా పెబ్బేరు ఫారెస్ట్ సెక్షన్ చిన్నంబావి మండలం బెక్కెం గూడెం గ్రామ సమీపంలో గొర్రెల మందను ఓ రైతు పోలంలో నిలిపారు.ఈ గొర్రెల మంద దగ్గరికి మొసలి రావడంతో అక్కడే ఉన్న కుక్కలు మొరగడంతో గొర్రెల కాపరి లేచి చూడగా మొసలి కనిపించడంతో ఆ కాపరి ఆత్మ రక్షణ కోసం మొసలిని చంపారని పెబ్బేరు పరిధిఫారెస్ట్ సెక్షన్ఆఫీసర్ రాణి చెప్పారు. చిన్నంబావి మండలం పోలీసుల సహకారంతో సెక్షన్ ఆఫీసర్ రాణి వెళ్లి చనిపోయిన మొసలితో పాటు చంపిన ఓ వ్యక్తిని జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ కి తీసుకొచ్చారు.