పాణ్యం: పేదల సొంతింటి కల నెరవేర్చిన అమరజీవి కామ్రేడ్ టి. వెంకట్ కల్లూరు అర్బన్ కార్మిక కర్షక భవన్ లో 13వ వర్ధంతి సభ
కల్లూరు అర్బన్ కార్మిక–కర్షక భవన్లో కామ్రేడ్ టి. వెంకట్ గారి 13వ వర్ధంతి సభ సిపిఎం నగర కార్యదర్శి ఎం. రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. సిపిఎం జిల్లా నాయకులు పి. నిర్మల, టి. రాముడు, యండి. ఆనంద్ బాబు తదితరులు పాల్గొని వెంకట్ గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించారు.ఇదిరాగాంధీనగర్ బలహీనవర్గాల ప్రాంతం నుంచి ఎదిగిన వెంకట్, పేదల ఇళ్ల కల నెరవేర్చేందుకు పరంబోగు స్థలాల్లో గుడిసెలు వేయించి సమతా నగర్, మమతా నగర్, చైతన్య నగర్, నీలం రాజశేఖర్ రెడ్డి నగర్, అమీర్ హైదర్ ఖాన్ నగర్ వంటి కాలనీల్లో వందలాది కుటుంబాలకు సొంత ఇళ్లు కల్పించాడని నాయకులు పేర్కొన్నారు.