ప్రకాశం జిల్లా రాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన సర్వసభ సమావేశం రసభస మారింది. అన్నం పల్లె గ్రామంలో నీటి బోర్లు చెడిపోయాయని ఎంపీడీవో పట్టించుకోవడంలేదని స్థానిక వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవోని ఉద్దేశపూర్వకంగా బెదిరిస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కొన్ని నెలలుగా తమ బిల్లులు చెల్లించడం లేదని వైసిపి నాయకులు ఆరోపిస్తుండగా అటువంటిది ఏమీ లేదని కొన్ని బిల్లులు పరిశీలించిన అనంతరం వాటిని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎంపీడీవో అన్నారు.