ఖైరతాబాద్: ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసింది :జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు: ఎమ్మెల్సీ కవిత
ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. 'గుర్తింపు కార్డులు, పెన్షన్లు, 250 గజాల స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సీఎం ఉద్యమకారులకు చెప్పినట్లుగా డిసెంబర్ 9 నాడు ప్రకటన చేయాలి. అప్లికేషన్స్ పెట్టుకోవాలంటూ రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారు. పెన్షన్లు, గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలి' అని కవిత డిమాండ్ చేశారు.