యాడికి మండలం నిట్టూరు గ్రామంలో పండగ రోజు ముగ్గులు వేస్తున్న మహిళల పట్ల శ్రీధర్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ధనుంజయ అనే వ్యక్తి మందలించాడు. దీంతో అదే రోజు రాత్రి కోపంతో శ్రీధర్ ధనుంజయ పై కర్రతో దాడి చేశాడు. చంపుతానని బెదిరించాడు. దీంతో ధనుంజయ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు ఆదివారం శ్రీధర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.