విజయవాడలో ఫిబ్రవరి 8వ తేదీన ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన 26వ కృష్ణా రివర్ క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీల్లో గెలుపు సాధించిన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం, తిమ్మసముద్రం గ్రామానికి చెందిన 72 సంవత్సరాలు కలిగిన కొట్ర సీతారామయ్యను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ హల్లో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ని కొట్ర సీతారామయ్య కలసి తను సాధించిన పతకాలను చూపించగా, ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొట్ర సీతారామయ్య ను ప్రత్యేకంగా అభినందించారు.