కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన అంజనప్ప అనే రైతు పంట నష్టపరిహారం చెల్లించాలని సోమవారం ఆర్డీవో వసంత బాబుకు విన్నవించారు. కళ్యాణదుర్గంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అంజనప్ప తన గోడును వెల్లబోసుకున్నారు. ఐదు ఎకరాల్లో కంది పంట సాగు చేశానని అయితే పంట పూర్తిగా దెబ్బతినిందని నష్టపరిహారం చెల్లించాలని విన్నవించారు. అందుకు ఆర్డీవో సానుకూలంగా స్పందించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.