గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం
ఎస్ఆర్ పురంలో మంగళవారం జాతీయ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ రమేశ్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఏఐసీసీ ఎన్నికల పరిశీలకులు జయ కుమార్ హాజరయ్యారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధ్యక్షుల మార్పు చేయాలన్న అధిష్ఠానం ఆదేశాలతో.. చిత్తూరు జిల్లా అధ్యక్షుల పరిశీలనకు తాను బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు. ప్రజామోదం ఉన్నవారికే అధ్యక్ష పదవిని తాను అప్పగిస్తామన్నారు.