కర్ణాటక నుంచి శ్రీశైలానికి,అచంచల భక్తితో… అలుపెరగని సంకల్పంతో సాష్టాంగ యాత్ర చేపట్టిన మల్లేష్ అనే కన్నడ భక్తుడు
కర్ణాటక నుంచి శ్రీశైలానికి… అచంచల భక్తితో… అలుపెరగని సంకల్పంతో,కర్ణాటక రాష్ట్రంలోని జీవరికి తాలూకా మళ్ళీవారిగా గ్రామానికి చెందిన మల్లేశ్ అనే శివభక్తుడు,సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం వైపు సాష్టాంగ యాత్ర కొనసాగిస్తున్నాడు.ఎర్రటి ఎండలో,తారు రోడ్డుపై బోర్లపడుత,ప్రతి అడుగూ “ఓం నమశ్శివాయ” జపంతో,ప్రతి నమస్కారం ఓ తపస్సుగా… ఇప్పటికే 17 రోజులుగా యాత్ర కొనసాగుతోంది.ప్రస్తుతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిసరాల్లో ఆయన ప్రయాణం సాగుతోంది.ఇంకా 10 నుంచి 12 రోజుల్లో నల్లమల అరణ్య మార్గం దాటుకుని శ్రీశైలానికి చేరుకోనున్నారు.ఈ యాత్రలో మల్లేశ్‌కు తోడుగా ఆయన వృద్ధ తల్లి వెంట నడుస్తుంది.