అన్నమయ్య జిల్లాలో ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి–జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించింది. ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. లక్ష్మీనరసయ్య ప్రారంభించారు. అదనపు డీఎంహెచ్‌ఓ డా. ఎల్. రాధిక, మెడికల సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్, అధికారులు, విద్యార్థులు పాల్గొని హెచ్ఐవీ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.డైట్ కళాశాలలో జరిగిన సమావేశంలో డా. రాధిక ఎయిడ్స్ వ్యాప్తి, జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. ముగ్గుల పోటీలో విజేతలకు లయన్స్ క్లబ్, సర్పంచ్ నాగార్జునచారి స్పాన్సర్ చేసిన బహుమతులను ప్రదానం చేశారు.