ఘన్పూర్ స్టేషన్: వృద్ధులు, వికలాంగులు ఓటు వేసేందుకు ఆటో సౌకర్యం కల్పిస్తున్న ఎన్నికల కమిషన్: స్టేషన్గన్పూర్ సిడిపిఓ ఫ్లోరెన్స్
స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వృద్ధులు, వికలాంగులు ఓటు వేసేందుకు అవగాహన సదస్సును సిడిపిఓ ఫ్లోరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, అంగన్వాడీ టీచర్లతో ఆమె మాట్లాడుతూ మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే సంకల్పంతో వృద్ధులను, వికలాంగులను పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక ఆటోలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నడవలేని వారిని పోలింగ్ స్టేషన్కు తీసుకువచ్చిన తర్వాత వీల్ చైర్లలో పోలింగ్ బూత్ లోకి నేరుగా వెళ్లి ఓటు వేసే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు