విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ దంపతులు
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి వేండ్ర త్రినాధరావు ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం బేడా మండపం ప్రదక్షణ స్వామివారి దర్శనం అనంతరము అమ్మవారి వద్ద ప్రత్యేక పూజ తదుపరి నాదస్వర వేదమంత్రాలతో వేద ఆశీర్వచనము ఇచ్చి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ఆలయ కార్య నిర్వహణ అధికారి వేండ్ర త్రినాధరావు స్వామివారి పటము ప్రసాదాలను బహుకరించారు.