ధర్మపురి: పట్టణంలో ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావం తెలిపే విధంగా పార్టీలకు అతీతంగా శుక్రవారం రోజన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలోని స్థానిక నంది చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు సంఘీభావ ర్యాలీనీ నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీలో విప్ లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు వివిధ పార్టీల నాయకులు,పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంది చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు జాతీయ జెండాలను పట్టుకొని పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీనీ నిర్వహించారు.