పెద్దపల్లి: అగ్ని ప్రమాదాలు సంబంధించినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని : మహిళలకు సూచించిన ఫైర్ అధికారులు
ఈరోజు గురువారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో గల రైల్వే కాలనీలో మహిళలకు అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారులు మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పెద్దపల్లి పట్టణంలో రైల్వే కాలనీలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ అధికారులు సిబ్బంది రైల్వే కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.