ప్రకాశం జిల్లా పొదిలి పట్టణం లో ఆర్యవైశ్య సభ్యులు కోటేశ్వరరావు వారి కుమారుడు అవినాష్ ను ఎస్సై వేమన కొట్టి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసినదే. దీంతో ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుబ్బారావు సోమవారం రోజు బంద్ కు పిలుపునిచ్చారు. వారి పిలుపుమేరకు పట్టణంలోని ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి సంఘీభావం తెలియజేశారు. వ్యాపార షాపులు మూసి వేయడంతో రహదారులన్ని నిర్మానుషంగా మారాయి.